Sunday 25 May 2014

ఆద్యాత్మిక దిన చర్య

మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుట కు ఆద్యాత్మిక దిన చర్య ఒక కొరడా వంటిది .ఈదిన చర్యను నియమంముగా పాటించిన చొ ప్రశాంత మనస్సు శాంతి కలిగి ఆద్యాత్మిక పదమునందుపురోగమింప గలుగును ప్రతి నిత్యమూ ఈ దిన చర్యను పాటించి దాని యొక్క అద్బుత ములగు ఫలితములను అనుభవించుము.
[1] పడక నుండి ఎపుడు లేచితివి ?
“పెందలకడనే పరుండి.పెందలకడ లేచుట వలన మానవుడారోగ్యమును,సంపదను ,మేధా శక్తీ ని పొందును .బ్రంహి ముహుర్తముననే 4 గంటలకు లేచి జప ,ద్యానముల నోనర్చుము .ఆ సమయములో ఎక్కువ పరిశ్రమ లేకుండగానే .మనస్సు తనకు తనే ద్యనావాస్త నొందును .
[2 ] నీవెన్ని గంటలకు నిద్రించితివి ?
ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలును .10 గంటలకు పరుండి ,వేకువ జామున 4 గంటలకు లెమ్ము .నిద్రాదిక్యము వలన మందత్వము మత్తత ఏర్పడును అదిక నిద్రవలన దేహ క్షీణము ,మేధా శక్తీ దుర్బలత్వము ఏర్పడును.
[3] యోగమునకు జపమొక ప్రాముక్యమైన అంగమై ఉన్నది .ఈ కలియుగములో భగవత్ సాక్షాత్కారము నొందుటకై జప ,కీర్తనడులు అత్యద్బుతమైన సాదనములై యున్నవి.
[4] ఎంత కాలము కీర్తన మొనరించితివి?
భగవన్నామము పాడుట చే భక్తుడు దివ్యానుభవమును ,దివ్య నహిమను ,దివ్య చైతన్యమును ,తనలోను సర్వత్రానూ కంచగాలుగును .ఈ కలియుగములో సంకీర్తన వలన సులబముగా దైవ దర్శనము నొంద వచును .
[5] ఎన్ని ప్రానయమములోనర్చితివి ?
“శ్వాసను అదుపులో నుంచుట”కే ప్రాణాయామము అనిపేరు .పొట్ట కాళిగా నున్నపుడు పద్మాసనము,సుకాసనము,సిద్దసనము,లేక సులువుగానున్నఆసనము పై కుర్చోనుము .నేత్రములను మూయుము కూడు ముక్కు రంద్రమును కుడి చేతి బొటన వ్రేలితో మూయుము .ఎడమ ముక్కు రంద్రము ద్వారా శ్వాసను మెల్లగా లోనికి పీల్చు కొనుము .తదుపరి నీ చిటికిన వేలు మరియు ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ ముక్కు రంద్రమును మూసివేసి శ్వాసను నీవెంత వరకైతే సుఖ కారముగా ఉంచ గలుగుదువోఅంత వరకు ఆపి ఉంచుము టడు పరి కుడి ముక్కు రంద్రమును తెరచి నిదానముగా శ్వాసను విడచి పెట్టుము ఈ విదముగా ముక్కు రంద్రములు మారుస్తూ పీల్చి వదలాలి దీనినే సుఖ ప్రాణాయామము అంటారు దీని వల్ల నాడి సుద్ది జరుగు తుంది .
[6] ఆసనములు ఎంత కాలమొనర్చితివి ?
అష్టాంగ యోగమునకు ఆసనమే ప్రదమావాస్త అయివున్నది .జప ,ద్యానములోనర్చుటకు పద్మాసన,సిద్దాసన,ములు ఆవస్యకములై ఉన్నవి ఆరోగ్యము నొందుటకై సీర్షాసనము,సర్వాన్గాసనము,పస్చిమోత్తసనము ,మొదలగునవన్నియు నానా విడములైన రోగములను పోగొట్టును
[7] ఒకే ఆసనము పై ఎంతకాలము ద్యానించితివి?
బ్రంహి మహుర్తమున 4 గంటల నుండి 6 గంటల వరకు నీ ద్యాన గదిలో నీకు సుకమైన ఆసనములో కుర్చుని చేయవలెను ఆసమయములో చేయు ద్యానము పరమో ఉత్క్రుష్ణమైనడి .
[8] గీతయందు ఎన్ని శ్లోకములు పతిన్చితివి,లేక కన్తస్త మోనర్చితివి?
స్వాదాయమే క్రియా యోగములేక నియమములలో ఒకటై ఉన్నది .స్వాద్యాయము హృదయమును పవిత్రమొనర్చి ,విశాలము ,అత్యున్నతము వికాసవంతమునగు భావములతో నింపి వేయును
[9] సత్ సంగమునెంత కాల మున్టివి ?
సాదుసత్పురుషులు ,యోగీశ్వరులు మరియు సన్యాసుల యొక్క సాంగత్యముమహిమను గురించి భాగవతము ,రామాయణము ,మొదలగు గ్రందములలో విసేశామముగా వర్ణించ బడినది .మానవుల యొక్కదుష్ట సంస్కారములను నసింప చేయుటకు ఒక్క క్షణ కాల సత్ సంగము మాత్రమే చాలును.
[10] మవునం ఎన్ని గంటలు అవలంబిన్చితివి?
వ్యర్ద ప్రసంగములతోను ,అతి ప్రసంగములతోను ,మన శక్తీ యంతయు వృధా యగుచున్నది .వ్యర్ధ ప్రసంగాములను వదలి పెట్టి మవునము అవలంబించిన ఇచా శక్తీ వృద్ది యగును వాగ్దోషములను నివారింప జేయును
[11] నిష్కామ ఖర్మ మెంత వరకు మోనర్చితివి ?
నిష్కామఖర్మ యోగము సమస్త పాపములను ,అపవిత్రను నసింప చేసి ,చ్త్తసుద్దినోనర్చును ,శుద్దమైన మనస్సు కలుగ చేయును ప్రతి దినము కొన్నింటిని పాటించు చుండుము .

No comments:

Post a Comment