Saturday 17 May 2014

ప్రాచీన ఆర్యధర్మం తాలూకు వికాస స్వరూపమే..నేటి హిందూ ధర్మం

"మన ఈ వికాసం పరాయి వాళ్ళని అనుకరించిందే అయితే; మన ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసమునూ, స్వయంపోషకత్వాన్ని నాశనం చేసేదే అయితే; మన ప్రాచీన సంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేసేది అయితే; మనలో ఆత్మగౌరవం రేకెత్తకుండా చేసే జాతీయ విరుద్ధమైన ప్రవృత్తులకు మూలకందమయినదైతే; అప్పడు మనం దాన్ని సమూలంగా ఊడపెరికేవాళ్ళం. ఏ మాత్రం వ్యామోహముంచేవాళ్ళం కాము. 

కాని అదలా కాలేదు. మన పూర్వ సంప్రదాయాలకు పరిపుష్టి కలిగిస్తోందది. పూర్వులు నాటిన విత్తనమే ఇలా వృక్షమై పెరిగింది. విత్తనం పూర్వరూపం మారిపోయిందని విచారించడంలో అర్థం లేదు. దాని పరివర్తన రూపం పోల్చుకోవాలి. వికాస స్వరూపం తెలుసుకోవాలి. చెట్టులోనే బీజం గుర్తించాలి. చెట్టుకే నీరు పెడితే పండు పండి, తిరిగి బీజం దొరుకుతుంది. అంతేకాని చెట్టు నరికేస్తే, వేళ్ళు పీకేస్తే విత్తనం దొరకదు. నేటి హిందూధర్మం తన ప్రాచీన ఆర్యధర్మం తాలూకు వికాస స్వరూపమే. రండి, దీన్ని వృద్ధి చేద్దాం. భారతదేశమంతటా అద్వైతం ప్రచారం చేద్దాం. భారత సంతతిని ఒక్క తాటి మీద నిలుపుదాం".

No comments:

Post a Comment