Wednesday 21 May 2014

ఫెంగ్‌షుయ్ : ఇతరులకు చేతనైనంత దానం చేయమంటోంది.!

దానం చేయడం ఎంతో మేలు, పుణ్యం చేకూరుతుందని పెద్దలు చెప్తుంటారు. ఇదే విషయాన్ని ఫెంగ్‌షుయ్ కూడా చెప్తోంది. ఇతరులకు దానం చేయడం ద్వారా తనకు ఇతరులచే సహాయం లభిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. 

ప్రత్యక్షంగా మీ బంధువులకు, స్నేహితులకే కాకుండా ఈ పొరుగింటి వారికి అలాగే సమాజానికి కాసింతైనా దానం చేయాలని ఫెంగ్ షుయ్ చెబుతోంది. మీరు సంపన్నులు కాకపోయినా మీకు వీలైనంత దానం చేయడం ద్వారా ధనవంతులు అవుతారని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. 

ఆధునికత, ఫ్లాట్ల సంస్కృతి కారణంగా ఇంటి ఇంటికి సంబంధం లేకుండా ఉండటం కంటే పక్కింటితో స్నేహభావంతో మెలగడం, వారి మంచిచెడులను అడిగితెలుసుకోవడం.. మీకు చేతనైనంత సాయం చేయడం మంచిదని ఫెంగ్ షుయ్ చెబుతోంది. అంతేకాకుండా ఎవరికి ఏం జరిగితే తనకేంటని నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడదని ఫెంగ్ షుయ్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment