Monday 19 May 2014

అయినా మనం క్షమిస్తూనే ఉంటాం....

అతి సర్వత్ర వర్జ్యయేత్ అంటోంది శాస్త్రం. మంచితనం, సేవాగుణం ఉండడం చాలా మంచిదే! కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. గత అరువది ఏడు (67) సంవత్సరాలుగా పాకిస్తాన్ మనతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యుద్ధం చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ మనం వారితో స్నేహం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.
వారు మన సైనికుల తలలు నరుకుతారు, మన అమాయక ప్రజల శరీరాలను ఒక్క బాంబు పేలుడుతో తుత్తునియలు చేసి పాశవికంగా ఆనందిస్తారు. మనపై యుద్ధానికి చైనాలాంటి దేశాలను ఉసిగొల్పుతారు. అయినా మనం క్షమిస్తూనే ఉంటాం.

పాకిస్తాన్ వారికి బెంగుళూరులో హృద్రోగ చికిత్సలు చేస్తూ హిందువులు రక్తదానం చేస్తూ వారికి ప్రాణదానం చేస్తున్నారు. వారు మాత్రం కార్గిల్ పై దురాక్రమణ చేస్తారు. దానిని కూడా చాలా సులభంగా క్షమించేసి మనం వారి కోసం లాహోరుకు బస్సు సౌకర్యం కల్పిస్తాం.

విషయమేమిటంటే  
 
పాకిస్తాన్ లోని లాహోరుకు చెందిన నలైన్-ఆల్-అజీజ్ అనే రెండేళ్ళ బాలుడు "బిలియరీ అట్రీసియా" అనే కాలేయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ఏప్రిల్ 23వ తేదీనాడు మన దేశంలోని క్రొత్త ఢిల్లీ వైద్యశాలలో అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స విజయవంతమై ఆ బాలుడి ప్రాణం నిలబడింది. మనం వారికి ప్రాణాలు పోసి తృప్తితో ఆనందిస్తూ ఉంటే, వారు మనవారి ప్రాణాలు చాలా సులభంగా, అత్యంత పాశవికంగా తీసేస్తూ ఆనందిస్తూ ఉంటారు.

No comments:

Post a Comment