HAINDAVA SAMSKRUTI
A monthly magazine entitled “HAINDAVA SAMSKRUTI” is published by Bhavishya Media Publications to provide spiritual knowledge at the doorsteps of the Subscribers.
Monday, 8 August 2016
Tuesday, 17 March 2015
Saturday, 9 August 2014
జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.
మన సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.
దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!
బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే 'ఉపాకర్మ' అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే 'యజ్ఞోపవీతం' అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని 'నూలి పున్నమి' అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్న వారిని ''ద్విజులు'' అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం 'జ్ఞానాధ్యయనం' గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడు తుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.
ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ'జంధ్యాల పూర్ణిమ' కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు
''యజ్ఞోపవీతం, పరమం పవిత్రం
ప్రజా పతే: యత్ సహజం పురస్తాత్
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:''
అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.
యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||
ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని 'బ్రహ్మముడి' అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.
జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవు తాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం||లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం. ఈ రోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రీ మంత్రాన్ని జపిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.
"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు.
దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"
"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."
నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము
నూతన యజ్ఞోపవీత ధారణ విధి
గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||
గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
ఆచమన౦
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య) ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా) ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా) ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా) ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా) ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య) ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా) ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య) ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా) ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా) ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా) ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా) ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య) ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా) ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
ప్రాణాయామః
ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:
ఓం భూః | ఓం భువః | ఓ౦ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓ౦ సత్యమ్ | ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
సంకల్పమ్
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహుర్తే, శ్రీ మహావిష్ణోరాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, అష్టవింశతతిమే కలియుగే, కలి ప్రథమ చరణే, మేరోర్దక్షిణ దిగ్భాగే; జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే,మేరోదక్షిణేతీరే, స్వగృహే-శోభన గృహే‘ ..... సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, … సంవత్సరే, …అయనే, .....ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ,విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, ..… గోత్రోత్పన్న ..… నామధేయస్య, మమ శ్రౌత స్మార్త విధివిహిత, నిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్)బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్, శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే !
ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:
ఓం భూః | ఓం భువః | ఓ౦ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓ౦ సత్యమ్ | ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
సంకల్పమ్
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహుర్తే, శ్రీ మహావిష్ణోరాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, అష్టవింశతతిమే కలియుగే, కలి ప్రథమ చరణే, మేరోర్దక్షిణ దిగ్భాగే; జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే,మేరోదక్షిణేతీరే, స్వగృహే-శోభన గృహే‘ ..... సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, … సంవత్సరే, …అయనే, .....ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ,విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, ..… గోత్రోత్పన్న ..… నామధేయస్య, మమ శ్రౌత స్మార్త విధివిహిత, నిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్)బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్, శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే !
యజ్ఞోపవీత సంస్కారమ్
నూతన యజ్ఞోపవీత మును ఒక ఇత్తడి గాని రాగి గాని బంగారం గాని పళ్ళెము లొ వుంచి పసుపు కుంకుమ అల్ది కలశ పాత్రలోని శుద్ద నీటిని గాయత్రి మంత్రమును ఊచ్చరిస్తూ సంప్రొక్షించాలి
గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
జలాభిమ౦త్రణ౦
కలశ పాత్రలోని శుద్ద నీటిని సంప్రొక్షిస్తూ ఈ క్రింది మంత్రమును పఠించాలి
ఓం ఆపో హిష్ఠా మయోభువః | తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే | యో వః శివతమో రసః | తస్య భాజయతే హ నః | ఉషతీరివ మాతరః | తస్మా అరంగ మామ వః | యస్య క్షయాయ జిన్వథ | ఆపో జనయథా చ నః |
ప్రాణ ప్రతిష్ఠ
ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున: ప్రాణమిహనోదేహి భోగమ్ జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ (ఎనిమిది సార్లు ఉచ్చరించాలి)
బ్రహ్మ
బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ:
సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ:
ఓం! వేదాత్మనాయవిద్మహే హిరణ్యగర్భాయ ధీమహి
తన్నోబ్రహ్మ ప్రచోదయాత్
రుద్ర
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాஉమృతా''త్
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
విష్ణు
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ
విశ్వోదయ స్థితిలయో న్నియతి ప్రదాయ
ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ
సత్కారణాయ వితతాయ నమో నమస్తే
నవత౦తు దేవతాహ్వాన౦
ఓ౦కారో‘గ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ
వాయుసూర్యౌ విశ్వేదేవా ఇత్యేతాస్త౦తుదేవతా:
త౦తుదేవతానామావాహయామి!
ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి
అగ్ని౦ ద్వితీయత౦తౌ ఆవాహయామి
నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి
సోమ౦ చతుర్థత౦తౌ ఆవాహయామి
పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి
ప్రజాపతిమ్ షష్టత౦తౌ ఆవాహయామి
వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి
సూర్యమ్ అష్టమత౦తౌ ఆవాహయామి
విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి
ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి
యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి
సామవేద౦ తృతీయదోరకే ఆవాహయామి
గాయత్రి దేవి - సూర్యనారాయణ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఓజోஉసి సహోஉసి బలమసి భ్రాజోஉసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్ గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి
ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట: కేయూరవాన్ మకరకు౦డలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర:
ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ:
దృశే విస్వాయ సూర్య౦
యజ్ఞోపవీత ధారణమ్
యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్య, పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా, త్రిష్టుప్ చ్చ౦ద: యజ్ఞోపవీత ధారణే వినియోగ:
ప్రాణ ప్రతిష్ఠ
ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున: ప్రాణమిహనోదేహి భోగమ్ జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ (ఎనిమిది సార్లు ఉచ్చరించాలి)
బ్రహ్మ
బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ:
సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ:
ఓం! వేదాత్మనాయవిద్మహే హిరణ్యగర్భాయ ధీమహి
తన్నోబ్రహ్మ ప్రచోదయాత్
రుద్ర
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాஉమృతా''త్
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
విష్ణు
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ
విశ్వోదయ స్థితిలయో న్నియతి ప్రదాయ
ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ
సత్కారణాయ వితతాయ నమో నమస్తే
నవత౦తు దేవతాహ్వాన౦
ఓ౦కారో‘గ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ
వాయుసూర్యౌ విశ్వేదేవా ఇత్యేతాస్త౦తుదేవతా:
త౦తుదేవతానామావాహయామి!
ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి
అగ్ని౦ ద్వితీయత౦తౌ ఆవాహయామి
నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి
సోమ౦ చతుర్థత౦తౌ ఆవాహయామి
పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి
ప్రజాపతిమ్ షష్టత౦తౌ ఆవాహయామి
వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి
సూర్యమ్ అష్టమత౦తౌ ఆవాహయామి
విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి
ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి
యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి
సామవేద౦ తృతీయదోరకే ఆవాహయామి
గాయత్రి దేవి - సూర్యనారాయణ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఓజోஉసి సహోஉసి బలమసి భ్రాజోஉసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్ గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి
ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట: కేయూరవాన్ మకరకు౦డలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర:
ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ:
దృశే విస్వాయ సూర్య౦
యజ్ఞోపవీత ధారణమ్
యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్య, పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా, త్రిష్టుప్ చ్చ౦ద: యజ్ఞోపవీత ధారణే వినియోగ:
యజ్ఞోపవీతము మూడు పోగులు గాని, నాలుగు పోగులు గా గాని వుంటుంది, బ్రహ్మచారి ఒక పోగును మాత్రమే దరించాలి, గృహస్తు మూడు లేక నాలుగు పోగులు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి దరించాలి. బ్రహ్మ ముడి అర చేతుల యందు వుంచి ఈ క్రింది మంత్రమును పఠిస్తూ మొదటి పోగును ధరించాలి.
యజ్ఞోపవీత ధారణ మ౦త్ర౦
యజ్ఞోపవీత౦ పరమ౦ పవిత్ర౦ ప్రజాపతేర్యత్సహజ౦ పురస్తాత్
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
రొండవ పోగు మ౦త్ర౦: మమ గృహస్థాస్రమ యొగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
మూడవ పోగు మ౦త్ర౦: ఉత్తరీయర్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
రొండవ పోగు మ౦త్ర౦: మమ గృహస్థాస్రమ యొగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
మూడవ పోగు మ౦త్ర౦: ఉత్తరీయర్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
నాల్గవ పోగు మ౦త్ర౦ : ధానార్థం ఛతుర్థ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
యజ్ఞోపవీత విసర్జన మ౦త్ర౦
ఉపవీతమ్ భిన్నత౦తు౦ జీర్ణ౦ కస్మల దూషిత౦
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
… ప్రవరాన్విత …. గోత్రోత్పన్న ….… శర్మ.......... అహం భో అభివాదయే
సమర్పణ
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్స౦ధ్యా క్రియాదిషు
న్యూన౦ స౦పూర్ణతా౦ యాతి సధ్యో వ౦దే తమచ్యుతమ్
మ౦త్రహీన౦ క్రియాహీన౦ భక్తిహీన౦ రమాపతే
యత్కృత౦తు మయా దేవ పరిపూర్ణ౦ తదస్తుమే
అనేన యజ్ఞోపవీత ధారణేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణా౦తర్గత
శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయ౦తా౦ వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
అచ్యుతాయ నమ: అన౦తాయ నమ: గోవి౦దాయ నమ:
నిత్య త్రికాల సంధ్యా వందనము
శరీర శుద్ధి:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతోஉపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
భూతోచ్చాటన:
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)
సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనః
ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మోరసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’యజిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః | (తై. అర. 4-42)
(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)
ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)
మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)
సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)
(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మోరసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’యజిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. 4. 42)
పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజోనిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)
అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రం:ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)
సాయం కాలార్ఘ్య మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీరసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇత్యంజలిత్రయం విసృజేత్)
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీరసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)
సజల ప్రదక్షిణం:
ఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణం:
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణం:
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణం:
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
(పునరాచమనం కుర్యాత్)
గాయత్రీ అవాహన:
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. 10. 33)
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపంతద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||
ఓజో’உసి సహో’உసి బల’మసి భ్రాజో’உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాஉగ్నిర్- ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |
ధ్యానమ్:
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం:
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖోஉథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితాஉస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనం:
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మోஉథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |
ప్రాతఃకాల సూర్యోపస్థానం:
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషాஉభి చ’ష్టే సత్యాయ’హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతేన జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ || (తై. సం. 3.4.11)
మధ్యాహ్న సూర్యోపస్థానం:
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనాஉదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గాదనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’తస్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతోஉర్ణవా”ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానం:
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామిబ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ంసమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనేஉభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)
దిగ్దేవతా నమస్కారః(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతినమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యోనమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామోஉకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాஉంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం):
ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యోஉభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వియథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)
భగవన్నమస్కారః
నమోஉస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనంఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసోஉసి శ్రీవాసుదేవ నమోஉస్తుతే ||
శ్రీ వాసుదేవ నమోஉస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
ఈశ్వరార్పణం:
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాஉஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |
కష్టసుఖాల్లో తోడుగా ఉండే అన్నకు ‘రక్షాబంధన్’

రాఖీ.. రక్షా బంధన్.. రాఖీ పౌర్ణమి.. ఏ పేరుతో పిలిచినా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి చిరునామా రాఖీ పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అయితే గతంలో ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో మాత్రమే ఈ పండుగను వైభవవంగా జరుపుకునేవారు. కాలం మారింది. ఇప్పుడు దేశమంతా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.
రాఖీ అంటే రక్షాబంధన్. సోదరీ, సోదరుల మధ్య విడదీయలేని అనుబంధానికి రాఖీ వేడుక ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను ఘనంగా జరుపుకుంటారు. చెల్లెలు రాఖీ కడితే అన్నయ్యలకు విజయం తప్పక వరిస్తుందని ప్రతీ భారతీయుని నమ్మకం. అందుకే సోదరి తనకు కట్టే రాఖీ కోసం సోదరులు వేచి చూస్తారు. అలాగే సోదరునికి రాఖీ కడితే తనకు వెన్నంటే ఉండి సంరక్షించుకుంటాడని యువతుల నమ్మకం. అనుబంధానికి, అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తుంది. ఆడ పడుచులు ఎక్కడ ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా.. రాఖీ పండగ రోజు తప్పకుండా కలుసుకుని వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి చక్కని నిదర్శనంగా నిలిచే ఈ పండుగకు నేటీకి ఆదరణ మాత్రం తగ్గలేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడి నుంచి అలెగ్జాండర్ వరకు సోదరి ప్రేమకు బానిసలుగా మారిన సంఘటనలు పురాణగాధల్లో వింటూనే ఉన్నాం. తల్లిదండ్రులు చూపే ఆత్మీయత లాగే సోదరులు, సోదరిపై చిరకాలం ప్రేమానుబంధాలను పంచడమే ఈ రక్షబంధన్ ప్రత్యేకత. జీవితాంతం కష్టానష్టాల్లో భర్త తర్వాత తోడుగా నిలిచే సోదరులకు ఎలాంటి కష్టాలు కలుగకుండా చూడాలంటూ సోదరీమణులు రక్షాబంధన్‌లను కడతారు. మొదట్లో రాఖీ పండుగను హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు దేశంలో అన్ని మతాలు వారు జరుపుకుంటున్నారు.
అమ్మ పంచే ప్రేమ.. ఆప్యాయత, నాన్న చూపే అనురాగాన్ని, బాధ్యతను.. సమపాళ్ళలో అందించగల గొప్ప శక్తే అన్న.. జీవితంలో తల్లి తండ్రులు ఎంత ముఖ్య పాత్రను పోషిస్తారో అంతకన్నా గొప్ప హోదా అన్నయ్యకు ఉంటుంది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి పునాది వేసే పండుగ.. రాఖీపౌర్ణమి.. కంటికి రెప్పలా కాపాడే అన్నయ్యను.. అనుక్షణం రక్షించుకోవడానికి చెల్లెలు కట్టే బంధనమే.. రక్షా బంధన్.. అన్నయ్యకు ఎలాంటి కీడు జరగకూడదనే ఉద్దేశంతో చెల్లెలు ఎంతో ప్రేమతో భక్తితో తన అన్నయ్యకు రాఖీ కడుతుంది.
సనాతన ధర్మ పరిరక్షణే ద్యేయముగా, హైందవ చైతన్య కరదీపికగా ప్రతి మాసం పాఠకుల ఇంట హైందవ ధర్మ సిద్దాంతాలను నాటుతు వెలువడుతున్న భారతీయ మానస పుత్రిక, అంతర్జాతీయ హిందూ ఆద్యాత్మీక మాస పత్రిక హైందవ సంస్కృతి ... చదవండి... చదివించండి... చందాధారులుగా చేరండి.. పూర్తి వివరాలకు 8686865615 నెంబరులో సంప్రదించండి.
Thursday, 7 August 2014
వరలక్ష్మి వ్రతం : పూజా విధానమేంటి?
లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత
సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద
కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర
గంగాధరాం|
త్వాం
త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||

ఈ వ్రతం చేయడం వల్ల
భర్త ఆరోగ్యం, ఆయుషు బాగుంటుందని మహిళల
విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు
తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.
మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి
తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మీ
రూపంగాదలిచి గౌరవిస్తారు.
పూజా విధానం..
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను ముందురోజే
మహిళలు సిద్ధం చేసుకోవాలి. శ్రావణమాసంలో రెండో శుక్రవారం రోజున
వేకువ జామునే నిద్రలేచి, కాలకృత్యాలను ముగించుకుని అభ్యంగన స్నానం ఆచరించి వరలక్ష్మీ మాతను పూజించాలి. ముందుగా
బియ్యంతో నింపిన కలశాన్ని నూతన వస్త్రంతో కప్పి,
పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ కలశానే్న లక్ష్మీమాత
ప్రతిమగా భావించాలి. పూజపైనే మనసును కేంద్రీకరించి వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి.
వ్రతం చేసే ముందు గణపతిని
ధ్యానించి భక్తిశ్రద్ధలతో పూజించాలి. గణపతి పూజ ముగిసిన
తర్వాత వరలక్ష్మీ నోము ప్రారంభించాలి. ఆచమనం
చేశాక కలశ పూజతో వ్రతం
ఆరంభమవుతుంది.
అమ్మవారి కలశంపై పసుపు, కుంకుమ, పూలు ఉంచి ఆవాహనం
చేయాలి. ఆ తర్వాత ఒక
పద్ధతి ప్రకారం మహాలక్ష్మికి ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవీతం, గంధం, అక్షతలు, పుష్పం,
అధాంగ పూజ, ఆభరణాలు, ధూపం,
దీపం, నైవేద్యం, నమస్కారం, పానీయం, తాంబూలం, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, తోరపూజ, వాయనం ఇవ్వడం వంటివి
పూర్తి చేయాలి.
వరలక్ష్మీ అష్టోత్తర శతనామాలు, సహస్ర నామాలు జపించితే
మరీ మంచిది. వాయనం ఇచ్చిన తర్వాత
కథ చదివి అక్షతలను శిరసుపై
ఉంచుకోవాలి. వ్రతం సందర్భంగా చుట్టుపక్కల
ముత్తయిదువలను పిలిచి వాయనాలు ఇవ్వాలి. ఈ సందర్భంగా ముత్తయిదువలను
‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం’ అని పరస్పరం అనుకోవాలి.
‘ఇచ్చేది లక్ష్మి.. లక్ష్మి స్వీకరించుగాక.. లక్ష్మీ స్వరూపిణులైన మా ఇద్దరిలో ఉన్న
లక్ష్మికి నమస్కారం’ అనే భావనే వాయనం
ఇవ్వడంలో పరమార్థం.
సామాజిక సంబంధాలు వృద్ధి చెందేందుకే ఇలా వాయనాలు ఇవ్వడం
ఆనవాయితీగా మారింది. వరలక్ష్మీ వ్రత కథ విన్నా,
వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినా, వ్రతం చేసేటపుడు ప్రత్యక్షంగా
చూసినా సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు
కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి..
వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

నోట్ : సనాతన ధర్మ రక్షణే
ద్యేయంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకై వెలువడుతున్న అంతర్జాతీయ హిందూ మాస పత్రిక
"హైందవ సంస్కృతి" .. చదవండి.. చదివించండి.. చందాదారులుగా చేరండి. హైందవ సంస్కృతి ప్రతి
మాసం పోస్ట్ ద్వారా పొందుటకు గాను సంవత్సర చందా
రూ..200 మాత్రమే. పూర్తి వివరములకు : +91 8686865615 నెంబరులో సంప్రదించగలరు.
Visit us : www.haindavasamskruti.in
Fallow us on face book: https://www.facebook.com/groups/1534627990093545/
Write us : editor.samskruti@gmail.com
Subscribe to:
Posts (Atom)